లాక్డౌన్తో జీవనోపాధి కొల్పోయి ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులకు యూత్ ఫర్ సర్వీస్ అనే సేవా సంస్థ అండగా నిలిచింది. వలస కార్మికుల జాడ తెలుసుకొని మరీ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో నివసిస్తోన్న వలస కార్మికులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దాదాపు 20 కుటుంబాలకు బియ్యం, నూనె, కందిపప్పు, గోధుమపిండి ఇతర పదార్థాలు అందజేశారు.
జాడ తెలుసుకున్నరు.. జరంత సాయం చేస్తున్నరు - నిత్యావసర సరుకులను పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. ఎవరైనా వస్తారేమో.. ఆహారాన్ని అందించి తమ ఆకలి తీరుస్తారేమోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో నివసిస్తోన్న వలస కార్మికుల పరిస్థతి కూడా ఇదే. ఇలాంటి వారందరికి అండగా నిలిచింది యూత్ ఫర్ సర్వీస్ సంస్థ
జాడ తెలుసుకుని.. జరంత సాయం చేస్తున్నారు
వీరంతా శ్రీశైలం నుంచి వచ్చిన వలస కార్మికులు. పూసలు తయారు చేసి వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. సరైన నివాసాలు లేక ఆకలితో అలమటిస్తోన్న వీరికి ఆహార పంపిణీ, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు స్రవంతి తెలిపారు. వారికి వారం రోజులకు సరిపడా సరుకులను అందించామని తెలిపారు.
ఇవీ చూడండి:'మద్యం ఆన్లైన్ అమ్మకానికి అనుమతివ్వండి'