సునీల్ నాయక్ అంతిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలని... యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
'సునీల్ నాయక్ అంతిమ యాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలి' - hyderabad latest news
ఉద్యోగ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనో వేదనతోనే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారని... యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి తెలిపారు. ఆయన అంతిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలని పేర్కొన్నారు.
!['సునీల్ నాయక్ అంతిమ యాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలి' Youth Congress state president Shiva Sena Reddy says all unemployed should take part in Sunil Nayak's funeral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11253580-510-11253580-1617364632503.jpg)
సునీల్ నాయక్ అంతిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు శివసేనా రెడ్డి తాజా వార్తలు
కల్వకుంట్ల కుటుంబం కళ్లు తెరిచే వరకు నిరుద్యోగులతో కలిసి యువజన కాంగ్రెస్ ఉద్యమిస్తుందని శివసేనా రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి సునీల్ నాయక్ భౌతికకాయాన్ని స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరుకు తరలింపులో భారీ ఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాలికపై వీధి కుక్క దాడి.. తల్లడిల్లిన చిన్నారి