తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాత సచివాలయాన్ని కరోనా ఆస్పత్రిగా మార్చండి' - Youth congress protest against state government

హైదరాబాద్​లో యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పాత సచివాలయాన్ని కరోనా ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్ చేసింది. ధర్నాకు యత్నించిన ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Youth congress protest against state government over the issue of corona hospital
'పాత సచివాలయాన్ని కరోనా ఆస్పత్రిగా మార్చండి'

By

Published : Jul 2, 2020, 3:15 PM IST

హైదరాబాద్​లో పాత సచివాలయాన్ని కరోనా హాస్పిటల్​గా మార్చాలంటూ... యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి ఫిరోజ్ ఖాన్‌తో పాటు మరో 20మంది కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పాత సచివాలయాన్ని కూల్చివేయవేయకుండా కరోనా ఆస్పత్రిగా మార్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్‌ యాదవ్‌తో పాటు కార్యకర్తలందరినీ... రాంగోపాల్ పేట పోలీస్​ స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details