శిథిలావస్థలో ఉన్న కూకట్‌పల్లిలోని హైదర్ నగర్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి కుమార్ యాదవ్ సందర్శించారు. కేటీఆర్ దత్తత తీసుకున్న డివిజన్‌లోని పాఠశాల భవనం దుస్థితి ఇలా ఉంటే మామూలు పాఠశాలల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం' - RAVI KUAR YADAV HYDERGUDA GOVT SCHOOL
హైదర్ నగర్‌లోని ప్రాథమిక పాఠశాలను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి కుమార్ సందర్శించారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
!['సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం' YOUTH CONGRESS LEADERS VISITED HYDERGUDA GOVT SCHOOL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944256-273-5944256-1580737386954.jpg)
సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత ఏడాది కాలంగా విద్యార్థులు ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ భవనంలో కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలలో కనీసం తాగేందుకు మంచినీరు లేవని.. బోరు పంపు గుండా కలుషితమైన నీరు వస్తుందని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం
ఇదీ చూడండి:గడ్డకడుతున్న కశ్మీరం.. మైనస్ 30 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు