పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చి ట్యాంక్ బండ్లో తాము ప్రయాణించిన బైక్‌ను విసిరేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
Youth Congress : ట్యాంక్‌బండ్‌లో బైక్ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు - throwing bike at Tank Bund news
పెరిగిన ఇంధన ధరలపై యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ట్యాంక్‌బండ్‌కు ద్విచక్రవాహనంపై వచ్చిన వారు... తాము ప్రయాణంచిన బైక్‌ను నీటిలో విసిరేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ట్యాంక్‌బండ్
కేంద్రం భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసనలతోనైనా మోదీ మేలుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్