రోజులో ఒక గంట మన ఆరోగ్యం గురించి కేటాయించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. అంబర్పేట్ పోలీస్ కేంద్రకార్యాలయంలో క్యూర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరయ్యారు. రోజురోజుకు పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సీపీ తెలిపారు. వీటిని అధిగమించాలంటే.. ప్రతిరోజూ ఒక గంట సేపైనా.. వ్యాయామం చేయాలని సూచించారు. అంబర్‌పేట్‌లో గతంలో 600 మంది సిబ్బందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించినందుకు రెడ్ క్రాస్ తరపున అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.. మనం తినే ఆహారంపై కొద్దిగా శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.
మీ ఆరోగ్యం... మీ చేతుల్లోనే ఉంది - health
హైదరాబాద్ అంబర్‌పేటలోని పోలీస్ కేంద్రకార్యాలయంలో క్యూర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ కమిషనర్ మఖ్య అతిథిగా హజరయ్యారు.
మెగా హెల్త్ క్యాంప్