ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో విస్తారంగా ఉన్నశేషాచల అడవుల్లో వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అడవుల్లో బీమా వంక, నాగాలమ్మ వంక, కనితిమడుగు వాగు, గుండాల అమ్మ వంకల గుండా నీరు సాగి మూలపల్లి చెరువు, కొండరెడ్డిగారిపల్లి చెరువు నిండింది.
శేషాచల అడవుల్లో జలకళ...సెల్ఫీలతో యువత ఉత్సాహం - చంద్రగిరి శేషాచల అడువులు తాజా వార్తలు
మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం, కరోనా విళయతాండవం లాంటి పదాలు విని విని బోర్ కొడుతోంది కదూ.. చుట్టూ సెలయేళ్లు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు... దట్టమైన అడవులు.. కోకిల కిలకిల రావాలు... అలాంటి ప్రదేశంలో ఫొటో షూట్ ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు కదా!.. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు ఇక్కడ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా మారింది.
శేషాచల అడవుల్లో జలకళ...సెల్ఫీలతో యువత ఉత్సాహం
చుట్టుపక్కల గ్రామస్థులు మానసిక ఆనందం కోసం అడవుల్లోని వంకలు, వాగులు సాగుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆహ్లాదంగా గడిపి వస్తున్నారు. నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ.. సెల్ ఫోన్లలో స్వీయ చిత్రాలు దిగుతూ ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతున్నారు.
ఇదీ చూడండి:తోపుడు బండిపై కరోనా మృతదేహం కలకలం!