తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్తింటి వేధింపులు ఓ వైపు.. కరోనా మహమ్మారి మరోవైపు - ap latest crime updates

కరోనా సోకి నిరాదరణకు గురైన ఓ మహిళ శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని నెల్లూరులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

young-women-sucide-at-nellore
ఏపీ: అత్తింటి వేధింపులు ఓ వైపు.. కరోనా మహమ్మారి మరోవైపు

By

Published : Jul 5, 2020, 1:31 PM IST

ఏపీ నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళకు సమీప బంధువుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం మనుమసిద్ధినగర్​లో ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ కారణంతో కొంతకాలంగా అత్తింటి వేధింపులు మెుదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె సమీప బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు మహిళకు కూడా పరీక్షలు చేయించారు. వైరస్​ నిర్ధరణకాగా... అత్తింటి వారి నిరాదరణకు గురైంది. శనివారం భర్త, కుటుంబ సభ్యులు కావలి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నసమయంలో పురుగుల మందు తాగింది. భర్త పలుమార్లు ఫోన్ చేసినా.. ఎత్తకపోవటంతో హుటాహుటిన నెల్లూరుకు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details