హైదరాబాద్ మణికొండలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి ల్యాంకో హిల్స్ భవనంలోని 15 అంతస్తు ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇంటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య - lockdown latest news
లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేని ఓ యువతి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మణికొండ పరిధిలో చోటుచేసుకుంది.
![ఇంటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య Young woman suicide at Lanco Hills Building in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7177432-746-7177432-1589350728970.jpg)
లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య
మృతురాలు కృష్ణాజిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెంకు చెందిన వీరవల్లిక(20). ల్యాంకోహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నివాసంలో పనిచేస్తోంది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి వస్తున్నానని తెలిపింది. లాక్‌డౌన్ వల్ల వాహనాలు నడవడం లేదని... తర్వాత రావాలని తల్లిదండ్రులు చెప్పారు. ఇంటికి వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. వీరవల్లిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!