తెలంగాణ

telangana

ETV Bharat / state

Challan: బైక్​పై ఫోన్​లో మాట్లాడుతూ యువతి ఫోజులు... అవాక్కైన పోలీసులు - 9thousand traffic fines

హైదరాబాద్​లో ఓ యువతి ఏకంగా 22 సార్లు సెల్​ఫోన్​ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కింది. సదురు యువతి ద్విచక్ర వాహనంపై చలాన్లును గమనించగా పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా రూ. 9వేల జరిమానాలు (Challan) ఉండటం గమనించారు.

Young
యువతి ఫోజులు

By

Published : Jun 15, 2021, 8:34 PM IST

హైదరాబాద్‌ నిజాంపేటలో ఓ యువతి ట్రాఫిక్‌ నిబంధనల (Traffic Rules) ఉల్లంఘనలు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా 22 సార్లు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కింది. సదురు యువతికి ఏకంగా దాదాపు రూ. 9 వేల పెనాల్టీలు (Challan) వేశారు. కొందరు ద్విచక్ర వాహనాలపై వివిధ రకాలు ఫీట్లు చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. కానీ ఈ యువతి ఎలాంటి భయం, జంకూ లేకుండా ట్రాఫిక్ పోలీసుల (Traffic Rules) ఫొటోలకు ఫోజులిచ్చింది.

కూకట్​పల్లి, నిజాంపేట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రెండు రోజులు కిందట బైక్​పై చరవాణిలో మాట్లాడుతూ వెళుతున్న యువతి కనిపించింది. వెంటనే కానిస్టేబుల్ ఫొటో తీయగా... చలాన్ నమోదైంది. వరుసగా అదే విధంగా రోజూ వాహనం నడపగా పోలీసులు చలాన్లు (Challan) విధించారు. ఆమె ఉల్లంఘనలపై దృష్టి పెట్టిన పోలీసులు వాహనంపై 22 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన కూకట్​పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా రూ. 9,070 కట్టించుకుని పంపించారు.

ఇదీ చదవండి:CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు

ABOUT THE AUTHOR

...view details