తెలంగాణ

telangana

ETV Bharat / state

Young Woman Murder in Champapet : చంపాపేట్‌ యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు ఏం జరిగిందంటే..? - The murder of a young woman in Champapet mystery

Young Woman Murder in Champapet : హైదరాబాద్ చంపాపేట్‌లో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వప్న మృతికి వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. ప్రియుడితో ఉండగా చూసిన ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌.. స్వప్నను చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Champapet Murder Case
Champapet Murder Case

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 11:57 AM IST

Updated : Oct 29, 2023, 2:32 PM IST

Young Woman Murder in ChampapetHyderabad : నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ.

హైదరాబాద్‌ చంపాపేట్‌లోని రాజిరెడ్డినగర్‌లో శనివారం జరిగిన స్వప్న దారుణ హత్య కేసులో మిస్టరీ వీడింది. యువతిని హత్య చేసింది భర్త ప్రేమ్‌కుమార్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని వాంగ్మూలాన్ని నమోదు చేశామని చెప్పారు. వివాహేతర సంబంధంతోనే యువతి హత్య జరిగినట్టు నిర్ధారించామని పోలీసులు వివరించారు.

Champapet Murder Case Updates : ఇంటికొచ్చేసరికి భార్య స్వప్న ప్రియుడితో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రియుడికి, అతనికి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆగ్రహంతో ప్రేమ్‌కుమార్ ఇంట్లో ఉన్న కత్తితో ఆమెపై దాడిచేసి చంపాడని చెప్పారు. మరోవైపు ప్రేమ్‌కుమార్‌పై.. యువతి ప్రియుడు దాడి చేసి బిల్డింగ్ పైనుంచి తోసివేసినట్లు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని.. ప్రియుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Constable Killed Wife at Vanasthalipuram : దారుణం.. భార్య గొంతుకోసి మేడపై నుంచి నెట్టేసిన కానిస్టేబుల్

అసలేం జరిగిదంటే : మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మోహన్-రూప దంపతుల కుమార్తె స్వప్న. చాలా కాలం నుంచి ఆ దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన మోహన్‌ ఆటో నడుపుతున్నాడు. ఎనిమిది నెలల క్రితం స్వప్న, హన్మంతు అనే యువకుడు చంపాపేట్‌లోని (Champapet) రాజిరెడ్డినగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. నెల రోజుల క్రితం స్వప్న ప్రేమ్‌కుమార్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని.. అతడితో కలిసి అదే ఇంట్లో ఉంటోంది.

అయితే తరచూ బయటి వ్యక్తులు ఇంటికి వచ్చి పోతుండటంతో.. ఇంటి యజమాని స్వప్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ తేల్చిచెప్పాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున విధులు ముగించుకొని స్వప్న ఇంటికి వచ్చింది. ఉదయం ప్రేమ్‌కుమార్‌ కూడా ఇంటికి చేరాడు. అక్కడ ఏ జరిగిందో కానీ స్వప్నను దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న సమయంలోనే ప్రేమ్‌కుమార్‌ రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు.

భార్య గొంతు కోసి హత్య.. శవాన్ని ప్లాస్టిక్ కవర్​లో చుట్టి భర్త పరార్

పెద్ద శబ్ధం రావడంతో బయటకు వచ్చిన ఇంటి యజమాని.. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రేమ్‌కుమార్‌ను చూశాడు. రెండో అంతస్తులోని గది వైపు వెళ్తుండగా.. ఇద్దరు యువకులు కిందికి రావటాన్ని గమనించాడు. గదిలోకి వెళ్లి చూడగా స్వప్న హత్యకు గురైనట్టు ఇంటి యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ్‌కుమార్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి మోహన్‌ ఐఎస్‌సదన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

A Young Woman Brutally Murdered in Champapet ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్

Mylardevpally Minor Boy Death Case update : వరుసకి సోదరితో వివాహేతర సంబంధం.. గొంతుకోసి హతమార్చిన బావ

గొంతుకోసి ఒకే కుటుంబంలోని నలుగురి హత్య.. గుడిసెకు నిప్పంటించి సజీవదహనం.. సీఎం రాజీనామాకు డిమాండ్

Last Updated : Oct 29, 2023, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details