తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య - rls

ఫోన్​లో ఎక్కువ మాట్లాడుతున్నావని తల్లి మందలించినందుకు ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్​లోని పంజాగుట్ట పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తల్లిమందలించిదని ఆత్మహత్య

By

Published : Jun 25, 2019, 6:02 AM IST

Updated : Jun 25, 2019, 6:47 AM IST

తల్లిమందలించిదని ఆత్మహత్య

తూర్పుగోదావరికి చెందిన అన్నవరం, బేబీలు పంజాగుట్ట ద్వారకపురి కాలనీలో ఆర్ఎల్​ఎస్ వసతి గృహం నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరి కూతురు శ్రావణి ఫోన్​లో ఎక్కువ మాట్లాడటాన్ని గమనించిన తల్లి కూతుర్ని మందలించింది. తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు వెల్లడించారు.

Last Updated : Jun 25, 2019, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details