తెలంగాణ

telangana

ETV Bharat / state

''మునుగోడు'లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు.. ఎన్నిక రద్దు చేయండి'

మునుగోడు ఉపఎన్నికలో మద్యం, డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ ఫోరమ్ కన్వీనర్ క్రాంతి మల్లాడి ఆరోపించారు. ఆయా పార్టీల అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​ను కలిసి వినతి పత్రం అందజేశారు.

munugode bypoll
munugode bypoll

By

Published : Nov 6, 2022, 8:38 AM IST

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో మద్యం, డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ఆయా పార్టీల అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ ఫోరమ్ కన్వీనర్ క్రాంతి మల్లాడి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని క్రాంతి కోరారు.

వికాస్​రాజ్​కు వినతిపత్రం అందజేసిన క్రాంతి మల్లాడి

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలను రద్దు చేసి, తిరిగి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని క్రాంతి కోరారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు దిగజారేలా ఆయా ప్రధాన పార్టీ అభ్యర్థులు మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులు సృష్టించారని, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ సభ్యులు ప్రశాంత్ జూకంటి, సర్వు అశోక్, మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి బత్తుల దిలీప్ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details