జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతీ యువకులంతా గ్రేటర్ ఎన్నికల్లోనూ వినియోగించుకుంటున్నారు.
మొదటిసారి ఓటును వినియోగించుకున్న యువత..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలిసారిగా యువత ఓటును వినియోగించుకున్నారు. ఓటు అనే ఆయుధంతో నచ్చిన మంచి వ్యక్తిత్వం గల నాయకులను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్న యువత... గ్రేటర్ ఎన్నికల విశేషాలపై వారి మాటల్లోనే విందాం.
భాగ్యనగర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతీయువకులు సందేశమిస్తున్నారు. కొవిడ్ ప్రభావం భయపెడుతున్నప్పటికీ... 65ఏళ్లకు పైబడిన వృద్దులు సైతం ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక సద్వినియోగం చేసుకోవాలని కొత్త ఓటరు సిరి చందన అన్నారు. ఓటు అనే ఆయుధంతో మనకు నచ్చిన మంచి వ్యక్తిత్వం గల నాయకులను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అమీర్‌పేటలోని స్థానిక ఆర్‌అండ్‌బీ పోలింగ్ బూత్‌లో తల్లిదండ్రులతో కలిసి సిరిచందన మొదటి సారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు వేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యువత ఓటు వేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా యువతకు ఆమె పిలుపునిచ్చారు.