హైదరాబాద్ ఫిలీంనగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. రవి, ఇర్షాద్ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు రవిని అపోలో ఆస్పత్రికి తరలించారు.
లైవ్ వీడియో: అందరూ చూస్తుండగానే... కత్తులతో పొడుచుకున్నారు - కత్తులతో పరస్పర దాడికి పాల్పడ్డ యువకులు
ఫిలీంనగర్‌లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడా... స్థానికులు అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు.
కత్తులతో పరస్పర దాడికి పాల్పడ్డ యువకులు
బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రంగప్రవేశం చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఇర్షాద్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిద్దరిపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, నార్సింగి పోలీస్‌స్టేషన్‌లలో బైకు, సెల్ఫోన్ దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: 'ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు'