తెలంగాణ

telangana

ETV Bharat / state

Young Man Unexpected Death in Hyderabad : ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లిన ప్రియుడు.. ఇంతలో తండ్రి ఎంట్రీ.. చివరికి! - ప్రియురాలి కోసం వెళ్లి ప్రాణాలు కొల్పోయిన యువకుడు

Young Man Unexpected Death in Hyderabad : నేటి తరం యువకుల తొందరపాటు పనులు చివరకు వారి ప్రాణాల మీదకే తెస్తున్నాయి. చిన్నతనంలోనే ప్రేమ అంటూ జీవితాలను ఆగమాగం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ బంధం చాలా మంది జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తుంది. కొన్ని సందర్భాల్లో వారి ప్రమేయం లేకుండానే విధి ఆడే వింత నాటకంలో ప్రాణాలను కోల్పొతున్నారు. ఆ విధంగానే తాజాగా ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లిన ఓ వ్యక్తి బిల్లింగ్ నాల్గోవ అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు.

Young Man Unexpected Death in Borabanda
Young Man Unexpected Death in Hyderabad

By

Published : Aug 7, 2023, 10:57 PM IST

Young Man Unexpected Death in Hyderabad :తెలిసీ.. తెలియని వయసు.. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కొలేని మనస్సు వారిది. ఎక్కడ చూసినా.. కష్టం వస్తే చాలు.. చావే శరణ్యమనుకునే పరిస్థితి. ఇలా చిన్న విషయాలకే ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్న కొందరు యువకులు.. కన్నవారికి తీరని వేదన మిగుల్చుతున్నారు. ఎవరేమైనా అంటే.. ఆ మాటలను తీసుకునే గుణాన్ని ఈతరం వాళ్లకు అసలు ఉండటం లేదు. చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురైప్రాణాలు బలి చేసుకుంటున్నారు. సినీ ఫక్కీ తరహాలో ప్రేమలో పడ్డాడు. తన ప్రేయసిని కలుసుకోవడం కోసం డెలివరీ బాయ్​గా వెళ్లి కాసేపు గడిపాడు. ఇంతలో యువతి తండ్రి వచ్చి వాళ్లను చూశాడు. దీంతో భయపడిన యువకుడు కంగారులో నాల్గో అంతస్తు నుంచి ఆలోచించకుండా దూకేశాడు. చివరికీ సినిమా తరహాలో ప్రేయసి కోసం ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని​ బోరబండ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహమ్మద్ షోయబ్ (19) అనే వ్యక్తి బోరబండలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలో నివసించే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. గత రాత్రి యువతి కోరిక మేరకు షోయబ్.. పిజ్జా తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లాడు. సడన్​గా ప్రియురాలి తండ్రి బిల్డింగ్ పైకి రాగా.. భయపడిన యువకుడు​ నాలుగోవ అంతస్తు పై నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్రంగా గాయలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. షోయబ్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి తండ్రి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Unexpected Death in Borabanda Hyderabad :సుమారుగా 17 నుంచి 23 వయస్సులో ఉన్న యువతీయువకులు ముందు వెనక ఆలోచించకుండా.. సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి నష్టం జరగకుండా తల్లిదండ్రులు ఈ వయస్సులో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకుంటూ.. జీవితంలో సరైన దిశగా పయనించే విధంగా మంచి మార్గాన్ని చూపించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో యువకులకు సరైన నిర్ణయాలు అందిస్తే.. వారి ప్రతిభను మెరుగు పరుచుకొని గొప్ప విజయాలను సాధిస్తారని అంటున్నారు. కావున తల్లిదండ్రులు కౌమర దశలో ఉన్న వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details