కరోనాతో వృద్ధురాలు చనిపోయింది... ఆమెను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని యువకులు పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. మేము బతకాలా వద్దా అంటూ అంబులెన్స్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని అంతిమ సంస్కారాలు సాఫీగా జరిగేటట్లు చూశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రేగాటిపల్లిలో జరిగింది.
కరోనా మృతురాలి ఖననాన్ని అడ్డుకున్న యువకులు - రేగాటిపల్లి కరోనా వార్తలు
కరోనాతో మృతి చెందిన వారి అంతిమసంస్కారాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొవిడ్‌తో చనిపోయిన ఓ వృద్ధురాలి మృత దేహాన్ని తమ స్థలంలో ఖననం చేయ్యెద్దంటూ పెద్ద ఎత్తున ఆ గ్రామ యువకులు ఆందోళన చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
![కరోనా మృతురాలి ఖననాన్ని అడ్డుకున్న యువకులు young-man-tried-to-block-burial-of-old-lady-who-died-with-corona-in-regatipalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7936468-1053-7936468-1594171269144.jpg)
ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు రేగాటిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. తమ ప్రాంతంలో కరోనా మృతురాలిని ఖననం చేయటానికి వీళ్లేదంటూ రేగాటిపల్లి యువకులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతానికి మృతదేహాన్ని ఎందుకు తీసుకువచ్చారంటూ, అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరంటూ అంబులెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులను అక్కడ నుంచి చెదరగొట్టారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య ఖననం చేశారు.