హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో విషాదం చోటుచేసుకుంది. చూస్తుండగానే రోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందింది అంబులెన్స్‌కు సమాచారమివ్వగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. సిబ్బంది యువకున్ని పరీక్షించి మృతి చెందాడని నిర్ధరించారు.
చూస్తుండగానే కుప్పకూలాడు... రోడ్డు మీదే ప్రాణాలొదిలాడు.. - young man died
"చావు చెప్పి వస్తదా...? పాణం పోవుడు ఎంతసేపు..." ఈ మాటలు వింటే నిజమే అనిపిస్తుంది హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగిన ఘటన చూస్తే. కళ్ల ముందున్న యువకుడు చూస్తుండగానే కుప్పకూలి... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చూస్తుండగానే కుప్పకూలాడు... రోడ్డు మీదే ప్రాణాలొదిలాడు..
మృతి చెందిన యువకుడు జవహర్‌నగర్‌కు చెందిన పృథ్వీరాజ్‌గా గుర్తించారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పృథ్వీని... కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పెద్ద ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించగా... ఆటోలో తరలించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన కుమారున్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. మృతి చెందిన యువకుడికి ఏమయ్యిందోనని దగ్గరికెళ్లేందుకు కూడా భయపడి ప్రజలు దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు.