చైతన్యపురిలో వంటగ్యాస్ పీల్చి యువకుడి ఆత్మహత్య - young man suicide in yadavanagar
చైతన్యపురి పరిధిలోని యాదవనగర్‌లో ఓ యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గ్యాస్పైపు లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ చైతన్యపురిలోని యాదవనగర్ కాలనీ, మూడో నంబరు రోడ్డులో ఉన్న ఓ అపార్ట్మెంటులో అనురాగ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నోట్లో గ్యాస్ పైప్ పెట్టుకుని తల మొత్తానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. చుట్టు పక్కల వారికి గ్యాస్ వాసన రావడం వల్ల మృతుని సమీప బంధువుకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.