అంబర్పేట్ విశ్వబ్రాహ్మణ వీధికి చెందిన సంతోష్ కుమార్ చారి (29) అనే వ్యకి మార్కెట్కు వెళ్లి స్కూటీ తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం సంతోష్ స్కూటీని ఢీకొట్టింది. అంతటితో ఆగక.. కిందపడిన సంతోష్ తల మీద నుంచి దూసుకెళ్లింది. భయపడిన డీసీఎం డ్రైవర్ మహ్మద్ జిలాని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ కంగారులో పటేల్ నగర్లోని గ్రీన్లాండ్ హోటల్ ముందు మరికొన్ని వాహనాలను ఢీకొట్టాడు.
వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. యువకుడు మృతి - రోడ్డు ప్రమాదం
వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన అంబర్పేట్లో చోటు చేసుకుంది. మార్కెట్కు నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తున్న సంతోష్ అనే యువకుడిని వేగంగా వచ్చిన డీసీఎం వెనక నుంచి ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. యువకుడు మృతి
స్థానికులు జిలానిని పట్టుకొని విచారించగా అంతకు ముందు జరిగిన ప్రమాదం విషయం బయటపడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'గగన్యాన్' కోసం భారత వైద్యులకు ఫ్రాన్స్ శిక్షణ