తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కుర్రాడికి చెట్టే ఐసోలేషన్​ గది... ఎందుకంటే..!

ఆ యువకునికి కరోనా సోకింది. ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు ఉన్నారు. ఒకే గదిలో నివాసముంటున్నారు. మరి ఐసోలేషన్​లో ఎలా ఉండాలి..? అనే ఆలోచనలో పడ్డాడు. అతని సమస్యకు వాళ్ల ఇంటి ఆవరణలో చెట్టే పరిష్కార మార్గమైంది. ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్ గదిగా మార్చుకున్నాడు ఆ బీటెక్​ కుర్రాడు.

Young man desperate for isolation isolation
Young man desperate for isolation isolation

By

Published : May 15, 2021, 3:34 PM IST

ఆ కుర్రాడికి చెట్టే ఐసోలేషన్​ గది... ఎందుకంటే..!
నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం కొత్త నందికొండకు చెందిన రమావత్ శివ... ఇంజినీరింగ్​ చదువుతున్నాడు. స్థానికంగా నిర్వహిస్తున్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలిగా పని చేసేందుకు వెళ్ళేవాడు. ఈ క్రమంలో శివకు కొవిడ్ లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకోగా... కరోనా అని నిర్దరణ అయ్యింది. ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా... ఒకే గదిలో నివాసముంటున్నారు.

ఈ పరిస్థితిలో శివకు హోం ఐసోలేషన్ ఉడటం అనేది ఇబ్బందిగా మారింది. ఇంట్లో ఉంటే కుటుంబసభ్యులకు కరోనా వస్తుంది. ఉన్నదేమో ఒకటే గది. బయట ఎవరూ ఆశ్రయం ఇచ్చేలా లేరు. ఏం చేయాలని ఆలోచించిన శివకు తన ఇంటి ముందు ఉన్న చెట్టు పరిష్కారం చూపించింది. ఆ చెట్టుపైనే మంచె కట్టుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. తొమ్మిది రోజులుగా కుటుంబసభ్యులు ఇచ్చిన ఆహారం, నీళ్లను తాడు సాయంతో పైకి తీసుకుంటున్నాడు.

ఇది చూసిన గ్రామస్థులు అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూనే... మరోవైపు జాలి పడుతున్నారు. ఇప్పటికైనా... ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామపంచాయతీలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు కావల్సిన వసతులు కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్‌ సందేశం

ABOUT THE AUTHOR

...view details