తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య - Young man commits suicide with aversion to society

అమ్మ, నాన్న నన్ను క్షమించండి. సమాజంపై విరక్తి చెంది ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఇమడలేకపోతున్నాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి.’.. అంటూ తల్లిదండ్రులకు ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాజంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

By

Published : Oct 21, 2019, 5:30 AM IST

హైదరాబాద్​లోని కూకట్​పల్లి దయారుగూడలో రాజా అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపినట్టు సమాచారం. జీవితంలో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో తెలిపాడు. ఏసీ మెకానిక్​గా పని చేస్తున్న రాజా.. తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వాసి అని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. యూసఫ్​గూడలోని మృతుని సోదరుడు చంద్రశేఖర్​కు ఈ విషయాన్ని తెలిపారు. తమ ఊరిలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని... తన సోదరుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సమాజంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details