Young Man Commits Suicide in Hyderabad : ఒకరితో సహజీవనం చేస్తూనే.. మరొకరితో ప్రేమాయణం సాగించాడో యువకుడు. చివరికి ఈ ప్రేమ వ్యవహారాలు ప్రియురాళ్లకు తెలిసిపోసి.. వారు పెళ్లికి నిరాకరించడంతో మరణమే శరణ్యమని ఉరి వేసుకొని ప్రాణాలను తీసుకున్నాడు ఈ ఇద్దరమ్మాయిలప్రేమికుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన శివప్రసాద్(23) అనే యువకుడు ఫిలింనగర్‌లోని దుర్గాభవానీ నగర్ బస్తీలో ఇల్లును అద్దెకు తీసుకొని మరో యువతితో కలిసి ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే ఉపాధి కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండేవాడు.
ప్రేమ పొందడం కోసం ఛాతిపై పచ్చబొట్టు : ఇప్పటివరకు అంతా హ్యాపీగానే సాగింది. కానీ ఇటీవల శివప్రసాద్ పని చేస్తున్న ఆస్పత్రిలో ఓ నర్సును ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ ఉండేవాడు. కానీ ఆమె తన ప్రేమను తిరస్కరిస్తూ వస్తూ ఉండేది. ఈ విషయం మొదటి ప్రేయసికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అయితే తాను ప్రేమిస్తున్న నర్సును నమ్మించేందుకు ఆమె పేరు, ఫొటోను ఇటీవల ఛాతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో ఆ యువతి శివప్రసాద్‌ను ప్రేమించేందుకు అంగీకరించింది. మోసం చేసిన వాడు ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్లు.. మూడు రోజుల క్రితం తనతో పాటు సహజీవనం చేస్తున్న యువతి.. అతని ఛాతిపై పచ్చబొట్టును గమనించి ఆగ్రహంతో అతడిని నిలదీసింది.
23 Years Young Man Suicide Love Failed : ఆపై మనస్తాపం చెంది.. నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి.. రెండో ప్రేమికురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకుందామని ప్రేమికుడు కోరాడు. అప్పటికే మొదటి ప్రేమ విషయం ఆమెకు తెలియడంతో అతడిని ఆమే తిరస్కరించింది. దీంతో ఇద్దరూ పెళ్లికి నిరాకరించారనే మనస్తాపంతో శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. నిద్రమాత్రలు మింగిన మొదటి ప్రేయసి కోలుకోవడంతో ఆమెను రెస్య్కూ హోమ్‌కు తరలించారు. ఆమె తెలిపిన వివరాలతో పోలీసులు ఈ కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చదవండి :