సరదా కోసం ప్రారంభించిన టిక్‌టాక్ వీడియో షూటింగ్ ఆ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. టిక్‌టాక్ వీడియో చేయటానికి ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడా 17 ఏళ్ల యువకుడు. పట్టుతప్పి కిందపడిపోవటం వల్ల గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌లో జరిగింది. ఇప్పటికైనా యువత ఇటువంటి ప్రమాదకర ప్రయత్నాలు మానుకోవాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు.
టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు.. ఆ తర్వాత? - టిక్‌టాక్ కోసం కరెంట్ స్తంభం ఎక్కిన యువకుడు న్యూస్
టిక్‌టాక్ మీద మోజులో పడి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు కొందరు. ఆటవిడుపు కోసం వాడాల్సిన యాప్‌ను అదే ఒక యజ్ఞంగా చేస్తున్నారు. దాని ధ్యాసలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌లో జరిగిన ఘటన, ప్రస్తుతం ఈ టిక్‌టాక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవటానికి ఉదాహరణ.

టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... ఆ తర్వాత ?