YOUNGERS RASH DRIVING :ఆంధ్రప్రదేశ్‌లోని ఓ యువకుడు మరో యువతిని తన బైక్ ట్యాంకుపై రివర్స్‌లో కూర్చొబెట్టుకుని పట్టపగలే రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విశాఖలోని ఉక్కునగరం ప్రధాన రహదారిపై యువజంట వికృత చేష్టలను పక్కనే మరో కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన స్టీల్‌ప్లాంట్ పోలీసులు..ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. గాజువాక సమీప వెంపలినగర్‌లో యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి పలు రకాల కేసులు నమోదు చేశారు. వారి ఇద్దరి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు స్టీల్‌ప్లాంట్ పోలీసులు తెలిపారు.
సినిమా తరహాలో రెచ్చిపోయిన యువ జంట..! - ap latest news
YOUNGERS RASH DRIVING IN VISAKHA : ప్రేమ అనాలో.. వికృత చేష్టలనాలో.. అనే విషయాన్ని పక్కన పెడితే, కొందరు యువత అవలంభిస్తున్న విధానాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. బైక్‌లపై హీరోల మాదిరిగా స్టంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు మరో యువతిని తన బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చో పెట్టుకుని రైడ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
సినిమా తరహాలో రెచ్చిపోయిన యువ జంట
"ఓ యువకుడు యువతిని తన బైక్ ట్యాంకుపై రివర్స్‌లో కూర్చొబెట్టుకుని రైడ్ చేశాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా మాకు తెలిసింది. వెంటనే వారి చర్యలు చేపట్టాము. ఆ యువకుడుపై పలు కేసులు నమోదు చేశాము."-స్థానిక పోలీసు
ఇవీ చదవండి: