హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువతి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స కోసం బాధిత యువతిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తాడేపల్లిగూడెనికి చెందిన స్వప్న అనే యువతి టిక్ టాక్ చేస్తుంటుంది. హీరో రాజశేఖర్ కారు డ్రైవర్ వీరబాబుతో టిక్ టాక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. హైదరాబాద్ వచ్చిన యువతి... వీరబాబును తరచూ కలిసేది.
ప్రేమ పేరిట...
ప్రేమ పేరిట వంచించి శారీరకంగా ఉపయోగించుకున్న వీరబాబు ఇప్పుడు మొహం చాటేశాడని బాధితురాలు స్వప్న ఆందోళన వ్యక్తం చేసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు... జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు రెండు రోజులుగా తిరుగుతోంది. పోలీసులు పట్టించుకోవట్లేదనే మనస్థాపంతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది స్వప్న. రక్తస్రావం అధికంగా అవుతుండటం వల్ల యువతిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
'నన్ను శారీరకంగా వాడుకుని మెుహం చాటేశాడు' ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్‌కు రప్పించండి'