మాదాపూర్‌లో కరెంట్ షాక్ కొట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలకత్తాకు చెందిన ఆడమ్ మార్క్ జోర్డాన్ వ్యాయమ శిక్షకుడిగా పనిచేస్తూ గుట్టల బేగంపేట్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. పని ముగించుకొని నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో కొండాపూర్ నుంచి బయలుదేరాడు. తన సైకిల్‌పై వస్తున్న సమయంలో రోడ్డుపై వర్షపునీరు ఉండటం వల్ల మృతుడు తన కాలు ఐరన్ రాడ్‌పై పెట్టగా, అతనికి కరంట్ షాక్ తగిలి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సాయి మణికంఠ వసతి గృహం ప్రక్కన జరుగుతున్న నూతన భవన నిర్మాణం ముందు ఉన్న చెట్టును నరికివేయడం వల్ల... చెట్టు కొమ్మలు విరిగి కరెంట్ వైర్లపై పడటంతో ఈ సంఘటన జరిగిందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.
కరెంట్ షాక్ తగిలి కలకత్తా యువకుడు మృతి - కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల మాదాపూర్‌లో కలకత్తాకు చెందిన ఆడమ్ మార్క్ జోర్డాన్ అనే యువకుడు కరెంట్ షాక్ తగిలి మరణించాడు.
కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి