తెలంగాణ

telangana

ETV Bharat / state

నవకళాకారులను చెక్కుతున్న యువచిత్రకారుడు - CHILDREN

గది గోడలే కాన్వాస్​లుగా మార్చుకుని ఊహలకు రంగులద్దుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చూట్టూ ఉన్న ప్రకృతిని మనసు కుంచెతో మరింత అందంగా ముస్తాబు చేసి... మురిసిపోతాడు. ఎందరో ఔత్సాహికులను చిత్రకారులుగా మలుస్తూ... కళ మీద ఉన్న ప్రేమను చాటుకుంటున్నాడు ఈ కళా ప్రేమికుడు.

కళను ప్రేమిస్తూ... చిన్నారులకు నేర్పిస్తూ...!

By

Published : Mar 10, 2019, 11:01 PM IST

కళను ప్రేమిస్తూ... చిన్నారులకు నేర్పిస్తూ...!
మనసులోని భావాలను చిత్రాలుగా మలచడం... ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే దృశ్యాలను, త్రీడీ, పొట్రెయిట్‌ చిత్రాలుగా మలచటం లక్ష్మీనారాయణకు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్‌ రాంబాగ్‌కు చెందిన లక్ష్మీనారాయణకు చిన్నతనం నుంచే చిత్రకళ పట్ల మక్కువ ఉండటంతో.... జేఎన్‌ఎఫ్‌యూలో ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాడు. ఊహించిన చిత్రాలు గీయడం వేరు... చూసింది చూసినట్టుగా రూపమివ్వడం వేరు.. ఈ రెండు అంశాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ మెప్పిస్తున్నాడు.

చిత్రాలే కాదు కళను నేర్పుతూ...

సినీరంగంలోనూ లక్ష్మీనారాయణ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కంట్రోల్‌ సీ, వీరభోగ వసంతరాయలు చిత్రాల్లో తన కుంచె పనితనాన్ని చూపించాడు. మంచు మనోజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లల్లోనూ పొట్రెయిట్‌ చిత్రాలను వేశారు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌తో పాటు మరో మూడు సినిమాలకు ఆర్ట్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. నచ్చిన కళను చుట్టూ ఉన్న వారికి ఉచితంగా నేర్పిస్తూ... మరికొందరు కళాకారులను తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం సుమారు వంద మందిచేత కళాఖండాలు చెక్కిస్తున్నాడు.

వెయ్యిమందే లక్ష్యంగా...

లక్ష్మీనారాయణ ఆవిష్కరించిన చిత్రాలు ఆయన ప్రతిభను జాతీయ స్థాయిలో నిలిపాయి. ఎన్నో పతకాలను తెచ్చిపెట్టాయి. 2003లో పోర్చుగల్‌లో జరిగిన అండర్‌-19 ప్రపంచ పెయింటింగ్‌, అదే సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరిగిన పోటీల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. 2004లో జపాన్‌లో నిర్వహించిన పోటీల్లోనూ బంగారు పతకం సాధించాడు. తన లాంటి మరో వెయ్యి మందిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు ఈ యువ కళాకారుడు.

అందమైన మనసు...

చిత్రకళ పట్ల ఆసక్తి ఉండి ఆర్థిక స్థోమత లేనివారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు కలర్స్‌, పేపర్స్‌, బ్రష్‌లను కూడా సమకూరుస్తు ఉదారతను చాటుకుంటున్నాడు ఈ కళాపిపాసి.

ఇవీ చూడండి:పింక్​థాన్​లో మహిళల సందడి​

ABOUT THE AUTHOR

...view details