తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాన్సర్​ను త్వరగా గుర్తించండి : యోగితా రాణా

హైదరాబాద్​ నగరంలో క్యాన్సర్​పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ మహమ్మారిని సకాలంలో గుర్తించి మెరుగైన వైద్యం తీసుకోవాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా సూచించారు.

yogitha rana

By

Published : Feb 4, 2019, 12:12 PM IST

yogitha rana
ప్రతిఒక్కరు క్యాన్సర్​పై అవగాహన కలిగియుండాలని... ప్రాథమిక దశలోనే క్యాన్సర్​ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్​ యోగితా రాణా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఎంఎన్​జే ఆస్పత్రి ఆధ్వర్యంలో పీపుల్స్​ ప్లాజా నుంచి జలవిహార్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఎక్కువగా బ్రెస్ట్​ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ బారిన పడతున్నారని యోగితా అన్నారు.
క్యాన్సర్​ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స ప్రారంభించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎన్​జే ఆస్పత్రి డాక్టర్ జయ, ఆయూష్మాన్ విభాగం అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details