వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ను ప్రశ్నిస్తున్న మహిళ YCP WOMENS ATTACK THE TDP WOWEN: వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై దాడులు అలవాటై పోయింది. ప్రస్తుతం వైసీపీ మహిళ కార్యకర్తలు సైతం టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు.
సోమవారం దేవినేని అవినాశ్‌కు చేదు అనుభవం:పనిచేసినోళ్ల జెండాలనే మా ఇళ్లపై పెట్టుకుంటాం. అందుకే టీడీపీ జెండా పెట్టుకున్నాం అంటూ విజయవాడలోని రాణిగారితోటకు చెందిన పలువురు మహిళలు వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను మోసం చేశారంటూ నిలదీశారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో రాణిగారితోటలోని తారక రామా నగర్లో ఎస్కే రమీజా అనే మహిళ ఇంటివద్ద ఆగారు.
ఒంటరి మహిళ పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఇంటిపై టీడీపీ జెండాను చూస్తూ.. "ఇది మనం పెట్టిందేనా' అని దేవినేని అవినాశ్ అడిగారు. 'ఔను! ఎందుకు పెట్టామో తెలుసా.! మమ్మల్ని ఆయన మోసం చేశారు' అంటూ కార్పొరేటర్ రామిరెడ్డిని చూపిస్తూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు గుడివాడలో తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు ఆ జెండాను పెట్టాం' అని మరో మహిళ చెప్పడంతో అవినాశ్ మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది.
మంగళవారం 20 మంది వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి:విజయవాడ రాణిగారితోటలో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సానుభూతిపరులపై వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. ఎస్కే రమీజా అనే మహిళ ఇంటి వద్ద సామగ్రిని చిందరవందర చేశారు. రాళ్లు రువ్వారు. సమీపంలోని దుకాణంలో కారం పొట్లాలు కొని అడ్డొచ్చిన వారిపై చల్లేందుకు యత్నించారు.
వైసీపీ కార్పొరేటర్ తమను మోసగించినందుకే తెలుగుదేశం జెండా పెట్టామంటూ ఆ మహిళ స్పష్టం చేశారు. గుడివాడలో టీడీపీ తరఫున మీరు పోటీ చేసినప్పుడు ఆ జెండా పెట్టామని మరో మహిళ చెప్పారు. తాము మీ వెంట తిరిగినా.. చిన్న చిన్న అవసరాలు పరిష్కరించేందుకూ కార్పొరేటర్ చొరవ చూపడం లేదని అవినాశ్ ముందు అసంతృప్తి వెళ్లగక్కారు. ఇది మనసులో పెట్టుకున్న వైసీపీ మహిళా కార్యకర్తలు 20 మంది మంగళవారం ఉదయం రమీజా ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారని స్థానికులు తెలిపారు. అవినాశ్ అనుచరులు దామోదర్, చిన్నారి, మాధవి దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.
పోలీసుల అదుపులో బాధితులు: దాడిలో గాయపడిన బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాురు. కృష్ణలంక పీఎస్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను వెళ్లొద్దంటూ ఆటోనగర్‌లోనే ఎమ్మెల్యేను పోలీసులు అడ్డగికోవడంతో వాగ్వాదం జరిగింది.
ఇవీ చదవండి