తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ది' - విశాఖ వార్తలు

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... దీనితోనే ప్రజల ఆకాంక్ష తీరుతుందని ఏపీ ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మూడు రాజధానులకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని హర్షిస్తూ విశాఖలో కొవ్వొత్తుల ర్వాలీ నిర్వహించారు.

'మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి'
'మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి'

By

Published : Aug 4, 2020, 2:07 PM IST


ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... దీనితోనే ప్రజల ఆకాంక్ష తీరుతుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని ఆయన హర్షించారు.

వైకాపా ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లిలో సోమవారం రాత్రి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలపడం ఏంతో సంతృప్తిగా ఉందని ముత్యాలనాయుడు అన్నారు.

ఇవీ చూడండి: 'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి'

ABOUT THE AUTHOR

...view details