ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ నేతృత్వంలో సుపరిపాలన సాగుతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కరోనా వ్యాప్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని విజయసాయి ఆరోపించారు.
చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా..? - విశాఖలో కరోనా కేసుల వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఏపీకి ప్రతిపక్ష నేతనా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. ఇల్లు వదిలి ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకు రావాలని హితవు పలికారు.
చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా..?
ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని... ఆయన ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు వదిలి వచ్చి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని 21 వ వార్డులో మంత్రులు... అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణతో కలిసి కార్మికులు, వార్డు వాలంటీర్లకు సరుకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు