తెలంగాణ

telangana

ETV Bharat / state

'రమేశ్ కుమార్​ నియామకంపై గవర్నర్ చూసుకుంటారు'

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు రమేశ్ కుమారే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగుతారని వైకాపా ఎంపీ రఘరామకృష్ణంరాజు అన్నారు. రమేశ్ కుమార్​ను పునర్నియామించే బాధ్యత గవర్నర్​పైనే ఉంటుందన్నారు.

ycp-mp-raghu-rama-krishnam-raju-comments-on-nimmagadda-ramesh-kumar-sec issue at ap
రమేశ్ కుమార్​ పునర్నియామక బాధ్యత గవర్నర్​దే: వైసీపీ ఎంపీ

By

Published : Jun 12, 2020, 12:03 PM IST

Updated : Jun 12, 2020, 2:30 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునర్నియామక అంశంపై దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఎస్​ఈసీగా రమేశ్ కుమారే కొనసాగుతారని వైకాపా ఎంపీ రఘరామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. రమేశ్ కుమార్​ను పునర్నియామించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు తీర్పే చెల్లుబాటువుతుందన్నారు. రమేశ్ కుమార్​ను పునర్నియామించే బాధ్యత గవర్నర్​పైనే ఉంటుందన్నారు.

రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమగ్రంగా పరిశీలించి.. మొత్తం సారాంశాన్ని అన్వయించుకోవాలే తప్ప... ప్రతి వాక్యానికి విడిగా భాష్యం చెప్పడం కుదరదు. రమేశ్ కుమార్​ను తిరిగి ఎస్​ఈసీగా నియమించకపోతే కోర్టు ధిక్కరణ నేరం కింద ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ వేసేందుకూ ఆయనకు అవకాశముంది. రమేశ్ కుమార్​ను రాజ్యాంగంలోని 243(కె) అధికరణ ప్రకారం గవర్నర్ నియమించారు. జస్టిస్ కనగరాజ్​ను ఏపీ పంచాయతీరాజ్ చట్టం కింద నియమించారు. జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లకపోతే... రమేశ్ కుమార్ నియామకం కూడా చెల్లదన్న వాదన సరికాదు. - రఘురామకృష్ణంరాజు, వైకాపా ఎంపీ

ఇదీ చదవండి:సమ్మె విరమించిన గాంధీ జూడాలు

Last Updated : Jun 12, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details