'ఏపీ సీఎం జగన్ హిందువు కాకపోవడం తమ దురదృష్టం' అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'సీఎం గారు మీరు అభివృద్ధి అంటుంటే కామెడీగా ఉంది!' - ycp-mp-raghu-rama-krishna-raju-sensational-comments-on-cm-jagan
వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. వినాయకచవితి వేడుకల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.
సీఎం గారు మీరు అభివృద్ధి అంటుంటే కామెడీగా ఉంది..!
ఇతర మతాల పండుగలకు లేని నిబంధనలు హిందువుల పండుగకు పెట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మతం మార్చుకోలేరు గానీ... అభిమతం మార్చుకోవాలని అన్నారు. హిందువుల మనోభావాలను కూడా గౌరవించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే వినాయక విగ్రహాలపై తెలుగు రాష్ట్రాల భాజపా నేతలు బండి సంజయ్, సోము వీర్రాజు చెరోలా మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. భాజపాలోని ఇద్దరు వ్యక్తులు చెరోలా మాట్లాడితే ప్రజలు దేనిని అనుసరించాలని ప్రశ్నించారు.