తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక్కడ మీకేం పని.. పోలీసులపై ప్రభుత్వ విప్ ఆగ్రహం - ప్రభుత్వ వీఐపీ చిర్ల జగ్గిరెడ్డి

MLA Chirla Angry On Police: కోడి పందేలు, గుండాటలు జరగకుండా చూడాల్సిన నాయకులే దగ్గరుండి పందేలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా కోడిపందేల బరుల వద్దకు పోలీసులు వస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కోడిపందేలు జరిగిన చోటకు పోలీసులు వస్తే వారిపై వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇక్కడికి వచ్చారని వారిని అక్కడి నుంచి పంపించేశారు.

MLA Chirla Angry On Police
MLA Chirla Angry On Police

By

Published : Jan 14, 2023, 5:01 PM IST

MLA Chirla Angry On Police: ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కోడిపందేల బరుల వద్ద ఉన్న పోలీసులపై ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి పందేలు, గుండాటలు నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసులు గుండాట శిబిరాలను తొలగిస్తున్న సమయంలో జగ్గిరెడ్డి అక్కడకు చేరుకుని పోలీసులపై మండిపడ్డారు. కోడి పందేల బరుల వద్ద ఇక్కడ మీకేం పనంటూ మండిపడ్డారు. ఇది ప్రైవేటు స్థలమని.. కేసులుంటే నాపై పెట్టమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా అడిషనల్ ఎస్సై సురేంద్రను, పోలీస్ సిబ్బందిని ఈ స్థలం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం కోడిపందేలను చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

ఇక్కడ మీకేం పని.. పోలీసులపై ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details