YCP Leader Attack on Sachivalayam Employee: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత దాడి చేశాడు. నల్లమడ మండలం ఎర్రవంకపల్లిలో జూనియర్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న మురళి నాయక్‌పై చేయి చేసుకున్నాడు. అనంతరం విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్లిన మురళి నాయక్‌కు మళ్లీ వైసీపీ నేత ఫోన్ చేసి దుర్భాషలాడాడని తెలిపాడు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.
సచివాలయం ఉద్యోగిపై వైసీపీ నేత దాడి.. పట్టించుకోని పోలీసులు - Telugu latest news
YCP Leader Attack on Sachivalayam Employee: తనకు నచ్చినట్లు నడుచుకోలేదని ఓ సచివాలయ ఉద్యోగిపై స్థానిక వైసీపీ నేత దాడి చేశాడు.. అనంతరం దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ఇదేం కర్మ అంటూ బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వాపోయాడు. ఈ సంఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీ