తెలంగాణ

telangana

ETV Bharat / state

YCP PROTEST: తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు - Sajjala demanded that Chandrababu apologize

ఏపీలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. అటు వైకాపా దాడులకు నిరసనగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా బందుకు తెదేపా పిలుపునిచ్చింది. ఇటు తెదేపా వ్యాఖ్యలను ఖండిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆధ్యర్యంలో నిరసనలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

ycp-call-statewide-protests-against-the-tdp-leaders-inappropriate-comments
ycp-call-statewide-protests-against-the-tdp-leaders-inappropriate-comments

By

Published : Oct 20, 2021, 5:00 AM IST

ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు(ycp call statewide protests) చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.

మంగళవారం తెదేపా నేత పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anandbabu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు పలు ప్రాంతాల్లో దాడి చేశారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details