YCP attack on TDP: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపెంటలో తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించారు. ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విద్యుత్ నిలిపివేసి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి - అనకాపల్లి టీడీపీ వార్తలు
YCP attack on TDP: మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై దాడికి యత్నించారు. ఈసారి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపెంటలో.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ దాడికి పాల్పడ్డారు. ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీవీజీ కుమార్ మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు
ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు అనుచరులే దాడి చేస్తున్నారని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీవీజీ కుమార్ ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొచ్చేందుకు స్థానిక ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇవీ చదవండి: