రోగులు, ఆస్పత్రులపై కొంత మంది పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారని, ఈ తరహా కార్యకలాపాలు తమ విధులకు ఇబ్బందిగా మారుతున్నాయని యశోదా ఆస్పత్రి యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల వహీద్ అలీఖాన్ ఊపిరితిత్తుల సమస్యలతో తమ ఆస్పత్రికి వచ్చారని పేర్కొంది.
ఆయనకు కరోనా లేదు.. ఆ బిల్లులు తప్పే: యశోదా ఆస్పత్రి - యశోదా ఆస్పత్రి వార్తలు
యశోదా ఆస్పత్రిపై కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి కరోనా ఉందని... ఛార్జీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి ప్రచారాల వల్ల రోగుల కుటుంబసభ్యులు, వైద్యులు మనస్తాపానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
yashoda hospital
కానీ ఆయనకు కరోనా ఉందంటూ... కొంత మంది అసత్య ప్రచారం చేయటంతో పాటు ఆస్పత్రి ఛార్జీలపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆస్పత్రి ఉపాధ్యక్షురాలు డాక్టర్ లలితా రెడ్డి ఆక్షేపించారు. వహీద్ అలీఖాన్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. రోగుల కుటుంబ సభ్యులను, వైద్యులను మనస్తాపానికి గురిచేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్