తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల

GANGULA KAMALAKAR: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తైనట్లు మంత్రి గంగుల కమలాకర్​ తెలిపారు. రూ.9,916 కోట్ల విలువైన 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల కమలాకర్​
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల కమలాకర్​

By

Published : Jul 1, 2022, 4:10 PM IST

GANGULA KAMALAKAR: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢ సంకల్పంతో కొనుగోళ్లు సజావుగా సాగాయని తెలిపారు. రైతులకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.

2021-22 రబీ సీజన్‌లో రూ.9,916 కోట్ల విలువైన 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రైతులకు రూ.9,680 కోట్లు సకాలంలో చెల్లించామని స్పష్టం చేశారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,42,894 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 322 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ప్రకటించారు. 2014-15 సీజన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.8 వేల కోట్లు ప్రభుత్వం రైతులకు అందజేసిందని వివరించారు.

ఏకైక ప్రభుత్వం మాదే..: కనీస మద్దతు ధరల ప్రకారం.. వరి పంట సేకరణ చేయడమే కాక.. కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తూ.. రైతులకు సంపూర్ణంగా అండగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం పోటీ రాలేదని మంత్రి పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం సేకరణ వంటి రైతు అనుకూల విధానాలు అవలంభిస్తోన్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details