యమహా సరికొత్త సంగీత పరికరాలను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పీఎస్ఆర్ 1400 కీబోర్డు, ఎఫ్ 280 ఎకౌస్టిక్ గిటార్‌ను ప్రదర్శించారు. ఈ నూతన 1400 కీబోర్డుపై కుటుంబమంతా కలిసి వివిధ రకాల సంగీత ప్రయోగాలు చేసేందుకు వీలుగా తయారు చేసినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు.
అన్ని రకాల పాటలు
ఇక కొత్త పాటలు మొదలుకుని... క్లాసిక్ గీతాల వరకు అన్నింటిని అద్భుతంగా పలికించవచ్చని సంగీతకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో యమహా ఎండీ తకాషీ హాగా, సంగీతకారుడు కార్తిక్ దేవరాజ్, యమహా ప్రొడక్ట్ స్పెషలిస్ట్ దర్యాల్ పాల్గొన్నారు.
యమహాలో సరికొత్త కీబోర్డు, గిటార్ ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి