Yagam at NTR Trust Bhavan: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చేపట్టిన దశ మహావిద్యా పూర్వక నవచండీ యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ యాగంలో తెదేపా సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, నన్నురి నర్సిరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
త్వరలో నిజామాబాద్‌లో టీడీపీ బహిరంగ సభ - ptd meeting
Yagam at NTR Trust Bhavan: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చేపట్టిన దశ మహావిద్యా పూర్వక నవచండీ యాగంలో ఆ పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఈ యాగం చేసినట్లు కాసాని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో యజ్ఙం
"తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాలి అని కోరుకున్నా.. త్వరలోనే నిజామాబాద్‌లో పార్టీ బహిరంగసభ ఏర్పాటు చేస్తాం.. అలాగే చంద్రబాబు నాయుడి గారి చేతుల మీదుగా బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తాం." - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
ఇవీ చదవండి :
Last Updated : Jan 10, 2023, 7:13 PM IST