Y Category Security to Etela Rajender :బీజేపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తమకు తెలిసిందని జమున ఆరోపించారు. ఇదే విషయంపై ఈటల రాజేందర్ కూడా స్పందించారు. నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తాను నయీంకే భయపడలేదని ఇప్పుడు ఈ బెదిరింపు కాల్స్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది.
ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం, ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ భద్రత కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వారం రోజుల్లో పూర్తి హక్కులు, స్వేచ్ఛతో కూడిన రాష్ట్ర ప్రచార కమిటీ ఛైరన్ పదవిని జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్‌కు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
- MLC Kaushik reddy fires on Eetala : 'ఈటలవి హత్యా రాజకీయాలు.. ఓటమి భయంతో నిరాధారమైన వ్యాఖ్యలు'
అసలేం జరిగిదంటే : ఈటల రాజేందర్‌ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆయన సతీమణి ఈటల జమున మంగవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌ను కౌశిక్ రెడ్డి రూ.20 కోట్లు ఇచ్చి చంపేస్తామని అన్నారని.. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఈటలను చంపేస్తామంటే ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని లేదని ఈటల జమున వ్యాఖ్యానించారు.