Kandikonda Yadagiri: అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించాలని పలువురు సినీ గేయ రచయితలు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కందికొండ మరణ వార్త తెలుసుకొని హుటాహుటినా ఆయన నివాసానికి చేరుకున్న రచయిత సుద్దాల అశోక్ తేజతోపాటు యువ రచయితలు మిట్టపల్లి సురేందర్, జయరాజ్ , కాసర్ల శ్యామ్, మంగ్లి, దర్శకుడు వేణు ఉడుగుల, సంగీత దర్శకులు బోలేషావలీ కందికొండ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Kandikonda Yadagiri: 'కందికొండ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలి' - kandikonda yadagiri latest news
Kandikonda Yadagiri: ప్రముఖ గేయ రచయిత కందికొండ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించాలని పలువురు రచయితలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కందికొండ అందించిన సాహిత్యాన్ని, ఆయన పాటలను గుర్తుచేసుకున్నారు. అలాగే కందికొండ కుటుంబానికి సర్కారు అండగా నిలవాలని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు.
అనంతరం తెలంగాణ ఉద్యమంలో కందికొండ అందించిన సాహిత్యాన్ని, ఆయన పాటలను గుర్తుచేసుకున్న సుద్దాల అశోక్ తేజ... కందికొండ మరణం సినీ గేయ రచయితలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజంలో రచయితగా కందికొండ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఆయన అంతిమ సంస్కారాలను లాంఛనంగా జరిపించాలని కోరారు. అలాగే కందికొండ కుటుంబానికి అండగా నిలవాలని సుద్దాల విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం కందికొండ భౌతికకాయాన్ని అభిమానులు,సినీ ప్రముఖల సందర్శనార్థం కళ్యాణ్ నగర్‌లోని నివాసం నుంచి ఫిల్మ్ చాంబర్‌కు తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అంతిమసంస్కారాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: