తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు పాటకు పట్టం

ఆయన కలం కదిలిస్తే చందమామ వెన్నెలంత హాయిగా ఉంటుంది. తన సాహిత్యంతో జగమంత కుటుంబంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.  "విధాత తలపున ప్రభవించినది" అంటూ మొదటి పాటతోనే సంగీత ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్​ ఫిలిం ఛాంబర్​లో సినీ రచయితల సంఘం ఆయనను ఘనంగా సన్మానించింది.

By

Published : Mar 7, 2019, 4:03 PM IST

సిరివెన్నెల

సిరివెన్నెల దంపతులను సత్కరిస్తున్న రచయితలు
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్​ ఫిల్మ్​ ఛాంబర్​ రచయితల సంఘం ఆయనను ఘనంగా సన్మానించింది. పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, జొన్నవిత్తుల, రామజోగయ్య శాస్త్రి, ఆర్పీ పట్నాయక్​ తదితరులు పాల్గొన్నారు. తనప్రయాణంలో సినీ గీత రచయితగానే తాను ఎక్కువ సంతృప్తి పొందానని సిరివెన్నెల తెలిపారు.

యువ రచయితలకు ఆదర్శం

సిరివెన్నెల యువ రచయితలకు ఆదర్శమని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరెన్నో జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి :జడ్పీ రిజర్వేషన్లు ఖరారు

ABOUT THE AUTHOR

...view details