జేబులోంచి తరచూ శానిటైజర్ బాటిల్ తీసుకుని.... చేతులు శుభ్రం చేసుకోవడం కొంచెం ఇబ్బందైన విషయమే. రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు ఇంకా కష్టంగా ఉంటుంది. వారి ఇబ్బందులు తీర్చేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాచ్ శానిటైజర్స్ అందించారు. 670 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు రిస్ట్ హ్యాండ్ శానిటైజర్లు అందించినట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. శానిటైజ్ చేసుకునేందుకు సులువుగా ఉంటుందన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి రిస్ట్‌హ్యాండ్ శానిటైజర్లు
రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు జేబులోంచి శానిటైజర్ తీసుకుని చేతులు శుభ్రం చేసుకోవడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. ఇది గ్రహించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్... కమిషనరేట్ పరిధిలోని 670 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు రిస్ట్ హ్యాండ్ శానిటైజర్లు అందించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి రిస్ట్‌హ్యాండ్ శానిటైజర్లు
కరోనా నేపథ్యంలో పోలీసులకు శానిటైజర్స్ తీసుకెళ్లడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ శానిటైజర్లు అందించామన్నారు. ఈ రిస్ట్ హ్యాండ్ శానిటైజర్లు ట్రాఫిక్ పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కరోనా రోగుల సేవలో యువతి- అంబులెన్స్ డ్రైవర్‌గా ఆదర్శం