తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో సరే.. సిటీ బస్సులెప్పుడో!!

మెట్రో రైలు పరుగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా మెట్రోలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ సిటీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాత్రం కదలిక కనిపించడంలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని స్థితిలో ఆర్టీసీ, ద.మ. రైల్వే అధికారులున్నారు. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

Worry about whenWorry about when buses will run buses will run
Worry about when buses will run

By

Published : Sep 8, 2020, 9:21 AM IST

కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కి.మీ. ప్రయాణించేలా నడుస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు, నగరం నలుమూలలకు తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులు ప్రయాణానికి ఎంతో అనువుగా ఉండేవి. ఎంఎంటీఎస్‌ రైళ్లలో 1.80లక్షల మంది, సిటీ బస్సుల్లో 33 లక్షల మంది నిత్యం రాకపోకలు సాగించేవారు. వీరిలో కొందరు ఊళ్లకు వెళ్లిపోగా కొందరు సొంత వాహనాలను సమకూర్చుకొని ఆదాయంలో 40 శాతం రవాణాకే వెచ్చిస్తున్నారు. మొత్తంగా 50 శాతం మంది ఇళ్లకే పరిమితమై.. బస్సులు, ఎంఎంటీఎస్‌లు ఎప్పుడు నడుస్తాయా.. అని ఎదురు చూస్తున్నారు.

ఆంక్షలన్నీ ఇక్కడేనా..?

బెంగళూరులో 50 శాతం బస్సులు తిరుగుతున్నాయి. ముంబయి, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లోనూ సిటీ బస్సులు నడుస్తున్నాయి. ముంబయిలో సబర్బన్‌ రైళ్లు 20 శాతం తిరుగుతున్నాయి. భారతీయ రైల్వే ప్రత్యేకంగా 200 రైళ్లు నడుపుతోంది. నగరం నుంచి 24 రాకపోకలు సాగిస్తుండగా.. మరో 4 కొత్తగా వేసింది. వీటికి తోడు ద.మ. రైల్వే పరిధిలోని పలు పట్టణాల మీదుగా మరో 8 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా అవసరం మేరకు ప్రత్యేక రైళ్లను పెంచుకుంటూ పోతున్న రైల్వే హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ సేవల అవసరాలను మాత్రం గుర్తించడంలేదు. 12 బోగీలతో ఏసీ లేకుండా నడిచే ఈ రైళ్లలో 750 నుంచి 800 మంది వరకు సురక్షితంగా ప్రయాణించవచ్ఛు మెట్రో మాదిరే మార్కింగ్‌ చేసి ప్రయాణికుల మధ్య దూరం పెంచవచ్ఛు ప్రస్తుతానికి ఉదయం, సాయంత్రం కొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే వీలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఆర్టీసీలోనూ ఇదే పరిస్థితి ఉంది.

అందని ఆర్టీసీ సేవలు

కరోనా ప్రారంభం నుంచి వైద్య, పారిశుద్ధ్య, పోలీసు విభాగాలు, వలస కూలీలను సొంత ఊళ్లకు పంపడానికి సిటీ బస్సులు సేవలందిస్తూ వచ్చాయి. రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకూ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సామాన్యుల అవస్థలు మాత్రం ఆర్టీసీ అధికారులకు పట్టడం లేదు. ఆర్టీసీ సత్వరమే నగరంలో సేవలందించేలా ప్రభుత్వం దిశా నిర్ధేశం చేయాలని నగర ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ కూడా నడిచేలా ద.మ. రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details