తెలంగాణ

telangana

ETV Bharat / state

'దీర్ఘకాలిక రోగులకు ఫిజియోథెరపీ తప్పనిసరి'

భవిష్యత్​లో ఆరోగ్యకరంగా జీవించాలంటే ఫిజియోథెరపి తప్పని సరి అని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్​రెడ్డి అన్నారు.​ వరల్డ్​ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్స్​ అసోసియేషన్ నక్లెస్ రోడ్​లో​ భారీ ర్యాలీని నిర్వహించారు.

'ఆరోగ్యంగా జీవించాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి'

By

Published : Sep 8, 2019, 6:24 PM IST

ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా రాష్ట్ర ఫిజియోథెరపిస్ట్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో పరుగు నిర్వహించారు. నెక్లెస్ రోడ్​లో నిర్వహించిన ఈ పరుగును తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పీపుల్స్​ ప్లాజా నుంచి జల విహార్ వరకు కొనసాగిన పరుగులో ఫిజియోథెరపి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చికిత్స పై సమాజంలో అవగాహన పెరుగుతోందని... దీనిని మరింత విస్తృతంగా ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని కోరారు. ఫిజియోథెరపీ కౌన్సిల్​కు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్లపై సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఛైర్మన్ వారికి హామీ ఇచ్చారు.

'ఆరోగ్యంగా జీవించాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి'

ABOUT THE AUTHOR

...view details