ఈసారి టీ-20 వరల్డ్ కప్(world's largest cricket bat) భారతే గెలుస్తుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు టీంలో ఉన్నారని అన్నారు.
భారత్ టీ-20 జట్టుకు మద్దతుగా ప్రజల్లో ఉత్సాహం పెంచేందుకు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్(world's largest cricket bat)పై 56 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. పెర్నోడ్ రికార్డు ఇండియా(world's largest cricket bat) కంపెనీ రూపొందించిన ఈ బ్యాట్‌ను ప్రభుత్వానికి అందించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బ్యాట్‌ను ఆవిష్కరించారు.
టీ 20 అంత సులభం కాదు. తక్కువ సమయంలో ప్రణాళిక బద్ధంగా ఆలోచించాలి. గెలుపు కోసం శ్రమించాలి. పాకిస్థాన్ పోలిస్తే భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. టీ 20లో ఈసారి కప్ మనమే గెలుస్తాం. -అజహరుద్దీన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు