తెలంగాణ

telangana

ETV Bharat / state

పొగాకు తాగితే క్యాన్సర్​ పక్కా: డాక్టర్​ రావు - WORLD TOBACCO DAY AWARENESS CAMPAIGNTOBACCO

జర్దా, గుట్కా, సిగరెట్, బీడీ, చుట్ట... ఇలా పొగాకును ఏ విధంగా తీసుకున్నా అనారోగ్యం పాలవడం ఖాయమని చెబుతున్నారు డాక్టర్ రావు. ధూమపానాన్ని మాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

'ధూమపాన ఆరోగ్యానికి హానికరం.. ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు'

By

Published : May 31, 2019, 5:05 PM IST

ప్రపంచ పొగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా... డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ హైదరాబాద్​లో అవగాహన సదస్సు నిర్వహించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొగతాగడం వల్ల జరిగే అనర్థాలను డాక్టర్ రావు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించి హైదరాబాద్​ని ధూమపాన రహిత నగరంగా చేయాలని సంకల్పించడం అభినందనీయమన్నారు. టొబాకో ఉత్పత్తి పదార్థాలు ఏ రకంగా తీసుకున్నా... అనేక రోగాలు వస్తాయని తెలిపారు. ఒకసారి తాగితే ఏమవుద్ది ఓసారి రుచి చూద్దాం అనకుంటూ మొదలు పెట్టిన వారు పొగాకును వ్యసనంగా చేసుకుంటున్నారని దాని వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని హెచ్చరించారు. గత 35 ఏళ్లుగా తమ ఫౌండేషన్ ద్వారా పొగాకు తాగడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు రావు తెలిపారు.

'ధూమపాన ఆరోగ్యానికి హానికరం.. ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు'

ABOUT THE AUTHOR

...view details